హైదరాబాద్: వికారాబాద్ పట్టణంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందారు. వికారాబాద్‌లోని రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వృద్దుడు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మరణించారు. మృతుడు గంగారం గ్రామానికి చెందిన పరిగి నర్సింహులుగా (67) గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm