హైదరాబాద్: తెలంగాణలో టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. కొన్నిరోజుల క్రితం రూ. 50 నుంచి రూ.60వరకు పలికి ధర ఒక్కసారిగా పడిపోయింది టమాట ప్రస్తుతం రూ.15 నుంచి రూ.10లకు తగ్గిపోయింది. కొన్ని చోట్ల అయితే కిలో టమాటా రూ. 5 పలుకుతోంది. సంక్రాంతి తర్వాత ధర మరింత తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లోని సంతలలో రూ.5లకు కిలో విక్రయిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన పలు సంతలలో కిలో టమాటా రూ. 5 పలికింది. మరోవైపు జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. ఆదివారం కా మారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని వారాంతపు సంతలో కిలో టమాట రూ.5లు మాత్రమే పలకడంతో వ్యాపారులు షాక్ తిన్నారు. టమాటా ధరలు మరింత దిగజారడంతో వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడు టమాట నారు 20పైసలకు ఒక్క మొక్క ఉండడంతో ఎక్కువ మంది రైతులు టమాట పంట పండించడానికి మొగ్గు చూపారు. అందులో భాగం గానే ఉత్పత్తి పెరిగి టమాట ధర తగ్గిపోయిందని అధికారు లు చెబుతున్నారు. అయితే టమాట ధర తగ్గడానికి కారణం సాగు విస్తీర్ణం పెరగడమే కారణమని ఉద్యాన వన శాఖ అధికారులు చెబుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm