హైదరాబాద్ : అలుపెరుగని ఉద్యమ యోధుడు బూర్గుల నర్సింగరావు గారి మృతి తెలంగాణాకు తీరని లోటు అని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన మృతికి హరీశ్ సంతాపం తెలిపారు. నిజాం కాలం లో విద్యార్థి ఉద్యమాలను నిర్మించిన ఘన చరిత్ర ఆయనది. తెలంగాణా తొలిదశ పోరాటం లో కమ్యూనిస్టు పార్టీ వైఖరి తో విభేదించి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన ఉద్యమించారు. మలిదశ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. గొప్ప మేధావిగా పోరాట యోధునిగా తెలంగాణా పోరాట యోధునిగా ఆయన ప్రజల జ్ఞాపకాల్లో కలకాలం నిలిచిపోతారు. బూర్గుల నర్సింగరావుగారి స్మృతికి నివాళులు అర్పిస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని మంత్రి పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 18 Jan,2021 03:03PM