హైదరాబాద్ : దాదాపు 10 నెలల తర్వాత దేశ రాజధానిలో 10, 12 తరగతులకు సోమవారం పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. శానిటైజర్లు, బెలూన్లు, పూలు, ఉపాధ్యాయుల చిరునవ్వులు విద్యార్థులకు స్వాగతం పలికాయి. పాఠశాలల ప్రాంగణాల్లో వెల్కమ్ బ్యాక్ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఈ విద్యా సంవత్సరంలో మొదటిసారి ఆఫ్లైన్ తరగతలకు హాజరవుతున్న విద్యార్థులు మాస్క్లు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ పాఠశాలల ముందు నిలబడ్డారు. ప్రతి విద్యార్థి శరీర ఉష్ణోగ్రతను టీచర్లు పరిశీలించి, స్వాగతం పలికారు. విడతల వారీగా విద్యార్థులు పాఠశాలకు హాజరవుతున్నారు. పదినెలల తర్వాత స్కూళ్లకు హాజరవడంపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm