హైదరాబాద్ : జనం రద్దీ ఎక్కువగా ఉన్నచోట బైక్‌ని అతివేగంగా నడపడమే కాకుండా.. వారిని అడ్డుకున్న ఎస్‌ఐపై దాడి చేశారు ఇద్దరు యువకులు ఈ ఘటన విజయనగరం జిల్లాలో గరుగుబిల్లి మండలం ఖడ్గవలసలో సోమవారం చోటుచేసుకుంది. పాచిపెంట ఎస్‌ఐ రమణపై దాడి చేసిన ఆ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బైక్‌పై వేగంగా వెళ్తున్న వారిని వారించినందుకు ఆయనపై యువకులు దాడికి దిగినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Mon Jan 19, 2015 06:51 pm