హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలో భారీ చోరీ జరిగింది. మల్లాపూర్ మండలం.. రేగుంట గ్రామం. వైన్స్ షాప్ లో నిన్న అర్ధరాత్రి సమయంలో ఒక యువకుడు దొంగతనానికి పాల్పడ్డాడు. వైన్ షాప్ లో కి దొంగతనానికి వెళ్లిన యువకుడు లాకర్ ఓపెన్ చేసి అందులో ఉన్న 5 లక్షల రూపాయలు దొంగతనం చేశాడు. ఉదయం షాప్ తేవడానికి వైన్ షాప్ ఓనర్ షాక్ అయ్యాడు. షాపు తెరిచి తాళాలు పగలగొట్టి ఉండడంతో అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఉన్న సిసి కెమెరా ను పరిశీలించారు. అయితే ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలను అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తెలిసిన వారే అని అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm