హైదరాబాద్ : భారత్-ఆసీస్ మధ్య టెస్ట్ సిరీస్ చివరి దశకు చేరుకుంది. అయితే ఈ సిరీస్ లో రెండు జట్లు 4వ టెస్టులో విజయం కోసం పోరాడుతున్నాయి. ఈ టెస్టు సిరీస్ లో భారత ఆటగాళ్లు చాలా మంది గాయాల బారిన పడిన విషయం తెలిసిందే. అందులో భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్సమెన్, హైదరాబాద్ క్రికెటర్ హనుమ విహారి కూడా ఉన్నాడు. సిడ్నీలో జరిగిన మూడో టెస్ట్ లో భాగంగా భారత జట్టును ఓటమి నుండి కాపాడిన విహారి గాయం కారణంగా నాలుగో టెస్ట్ నుండి తప్పుకొని హైదరాబాద్ చేరుకున్నాడు. ఇక అతను ఈరోజు తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కలిసాడు. దీనికి సంబంధించిన ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ మిమ్మల్ని కలవడం, క్రికెట్ గురించి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది అని తెలిపాడు. అయితే ఇంతకముందు సిడ్నీలో టెస్ట్ లో హనుమవిహారి ఆడిన తీరుపై మంత్రి కేటీఆర్ కూడా హర్షం వ్యక్తంచేశారు. ఇదో అద్భుతమైన టెస్టు అని, భారత ఆటగాళ్ల తెగువ, పట్టుదల, ధైర్యాన్ని కొనియాడారు. ఒకవైపు ఆటగాళ్లు గాయాల బారిన పడినా, మరోవైపు జాత్యంహకార వ్యాఖ్యలు ఎదురైనా... ఏవీ జట్టు స్ఫూర్తిని దెబ్బతీయలేదని ప్రశంసించారు. ఈ డ్రా.. ఇన్నింగ్స్ విజయం కన్నా బాగుందని సంతోషం వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm