హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 23న బెంగాల్‌లో పర్యటించనున్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకొని కేంద్ర సాంస్కృతిక శాఖ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
Mon Jan 19, 2015 06:51 pm