హైదరాబాద్ : ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు టీమిండియా జట్టును రేపు ఎంపిక చేయనుంది. ఆసీస్ తో సిరీస్ సందర్భంగా గాయపడిన ఆటగాళ్లపై రేపటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కాగా నటరాజన్, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ వంటి కొత్త ఆటగాళ్లు ఆసీస్ గడ్డపై విశేషంగా రాణిస్తున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ తో సిరీస్ కు టీమిండియాను ఎంపిక చేయడం సెలెక్టర్లకు కాస్త కష్టమైన విషయమే.
Mon Jan 19, 2015 06:51 pm