హైదరాబాద్ : అక్రమంగా తరలిస్తున్న రూ. 23 లక్షల విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లను ఖమ్మం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ సతీశ్ కుమార్, రూరల్ ఎస్‌ఐ రాము సిబ్బందితో రూరల్ మండలం ఆటోనగర్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. పాల్వంచ వైపు వెళ్తున్న బొలెరో వాహనం (టీఎస్ 26టీ 0450) లో గుట్కా, ఖైనీ ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మేకల ప్రభాకర్ అనే వ్యక్తి కర్ణాటక రాష్ట్రం బీదర్‌లో గుట్కా ప్యాకెట్లను కొనుగోలు చేసి పాల్వంచలో చిల్లర దుకాణాదారులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తెలిసిందని టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు చెప్పారు. వాహన డ్రైవర్ మురళి, చంటి అనే మరోవ్యక్తిని అరెస్టు చేశామని, ప్రభాకర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm