హైదరాబాద్ : ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఆదరగోడుతున్నాడు. ఈ హైదరాబాద్ ఆటగాడిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించాడు. హైదరాబాదుకు చెందిన మన కుర్రాడు అదరగొడుతున్నాడంటూ కేటీఆర్ ప్రశంసించారు. తండ్రిని కోల్పోయిన విషాదకర పరిస్థితిలోనూ ఈ విధంగా రాణించడం మామూలు విషయం కాదని కొనియాడారు. నీ అద్భుత ప్రదర్శన భారత జట్టు ముందర సిరీస్ గెలిచే అవకాశాన్ని నిలిపింది. మీ నాన్న పైనుంచి దీవెనలు అందజేస్తూ నీ ఆటతీరు పట్ల కచ్చితంగా గర్విస్తాడు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm