హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లాలో ఓ బస్సు అదుపు తప్పింది. చింతూరు ఘాట్ రోడ్డులో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. రాజమండ్రి నుంచి చింతూరు వస్తుండగా ఘాట్ రోడ్డులో దుర్గమ్మ గుడి వద్ద బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సులోని 40 మంది అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm