హైదరాబాద్ : అక్రమంగా నిలువ ఉంచిన 60 ట్రాక్టర్ల ఇసుక డంపును కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి 60 ట్రాక్టర్ల ఇసుక డంపును స్వాధీనం చేసుకొని రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్ధనగర్ వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ సీఐ రాణాప్రతాప్, ఎస్ఐ సత్తార్, కానిస్టేబుల్స్ మధు, తిరుపతి, రమేష్, విజయ్, హోమ్ గార్డ్ పోచం తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm