అమరావతి: కృష్ణా జిల్లా గుడివాడ టూ టౌన్ ఎస్సై పిల్లి విజయ్ కుమార్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఫ్లాట్‌లోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. మూడు నెలల క్రితమే ఆయనకు వివాహమైంది. అయితే, భార్యను కాపురానికి తీసుకురాకుండా గుడివాడలో ఓ బ్యూటీషియన్‌తో కలిసి ఉంటున్నట్టు తెలుస్తోంది. హనుమాన్ జంక్షన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆమె పరిచయం కావడంతో అప్పటి నుంచి ఆమెతోనే ఉంటున్నట్టు చెబుతున్నారు. విజయ్‌కుమార్ గతంలో సస్పెండయ్యారు కూడా. కాగా, ఆయన ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm