హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం రామన్నపేట, కొలనూర్ గ్రామాల పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. చిరుత గ్రామస్తుల కంట పడటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 3 రోజుల క్రితం వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామ శివారులో చిరుత హల్ చల్ చేస్తోంది. 5 రోజుల క్రితం బోయినిపల్లి మండలం మల్కాపూర్‌లో చిరుత బావిలో పడిపోయింది. సిరిసిల్ల జిల్లాలో 10 రోజుల వ్యవధిలోనే మూడు చోట్ల చిరుత కనిపించింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm