హైదరాబాద్: స్టేషనరీ కోసం వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఓల్డ్ అల్వాల్‌లోని సిటిజెన్ కాలనీలో నివాసముంటున్న షేర్మియా అనే విద్యార్థిని సాయంత్రం సమయంలో స్టేషనరీకి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. స్థానిక పాఠశాలలో ఆమె తొమ్మిదవ తరగతి చదువుతున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఆరా తీసినప్పటికీ ఎలాంటి ప్రయోజనమూ లేకుండా పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీసులు అదృశ్యం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Mon Jan 19, 2015 06:51 pm