హైదరాబాద్: అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) నూతన అధ్యక్షుడిగా మహబూబ్‌నగర్ జిల్లా గుమ్మడం గ్రామానికి చెందిన భువనేశ్ బుజాల ఎన్నికయ్యారు. టెన్నెస్సీలోని నాష్‌విల్లేలో ఇటీవల జరిగిన ఆటా కార్యవర్గ సమావేశంలో మాజీ అధ్యక్షుడు పరమేశ్ భీంరెడ్డి నుంచి ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. డిసెంబరులో జరిగిన ఈ ఎన్నికల్లో.. ఆటా కార్యదర్శిగా హరిప్రసాద్‌రెడ్డి లింగాల, కోశాధికారిగా సాయినాథ్‌రెడ్డి బోయపల్లి, సంయుక్త కార్యదర్శిగా రామకృష్ణారెడ్డి, సంయుక్త కోశాధికారిగా విజయ్‌కుందూరు ఎన్నికయ్యారు. ఆటా కార్యవర్గ సమావేశంలో వీరంతా బాధ్యతలు స్వీకరించారు.
Mon Jan 19, 2015 06:51 pm