హైదరాబాద్: నేడు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు, రైతు సంఘాల నేతల మధ్య జరగాల్సిన పదో విడత చర్చలు వాయిదా పడ్డాయి. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ, దాదాపు రెండు నెలలుగా హస్తిన సరిహద్దుల్లో రైతులు నిరసనలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ 9 సార్లు కేంద్రం, రైతుల మధ్య చర్చలు జరిగినా, ఇంతవరకూ ప్రతిష్టంభన వీడలేదు. ఇక నేటి చర్చలు రేపటికి వాయిదా వేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలూ కృతనిశ్చయంతో ఉన్నాయని ఈ సందర్భంగా కేంద్రం ప్రకటించింది.
Mon Jan 19, 2015 06:51 pm