విజయవాడ: బెజవాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టేందుకు సిద్ధమైన టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వివరాల్లోకి వెళితే... నిన్న మంత్రి కొడాలి నాని గొల్లపూడిలో దేవినేని ఉమాను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. ఆమేరకు ఈరోజు ఉదయం గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్న ఉమాను పోలీసులు అడ్డుకున్నారు. భారీగా చేరుకున్న తెదేపా శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు తెదేపా కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. భారీగా మోహరించిన పోలీసులు ఉమాను అరెస్టు చేసి పోలీసు వాహనంలో అక్కడి నుంచి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm