హైదరాబాద్ : త్రిపురలో బీజేపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలోని సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలో ఉన్న సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ చౌదరీపై దాడి చేసారు. కార్యాలయంలో ఉన్న పర్నీచర్ ధ్వంసం చేసి, అక్కడే ఉన్న కారు అద్దాలను పగులగొట్టారు. అంతేకాకుండా సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ జర్నాదాస్ వైద్యా ఇంటిపైకి రాళ్లు విసిరి ఇంటి అద్దాలను ధ్వంసం చేసారు. ఇప్పటికే త్రిపురలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుపై కూడా ఇలాంటి దాడి ఘటనే ఆదివారం చోటుచేసుకుంది. దీంతో ప్రతిపక్షనేతలపై జరుగుతున్న దాడులపై రాష్ట్ర గవర్నర్ ను మాజీ సీఎం మాణిక్ సర్కార్ కలిసారు. బీజేపీ కార్యకర్తలు చేస్తున్న విధ్వంసాలపై చర్చించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు ప్రజలను కూడా కలవనివ్వకుండా బీజేపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకుని దాడులకు పాల్పడుతున్నారని గవర్నర్ కు తెలిపారు. బాలికలు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm