వరంగల్: జాతీయ కాంగ్రెస్ నిర్ణయం మేరకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేఖ చట్టాలను ఉపసంహరించుకోవాలని టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమంకు వరంగల్ అర్బన్ & రూరల్ జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ కు బయలుదేరిన జిల్లా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకొని నయిం నగర్ లోని నాయిని రాజేందర్ రెడ్డి స్వగృహంలో హన్మకొండ నిర్బంధంలో ఉంచారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ అరెస్టులు అప్రజాస్వామికం, కనీసం నిరసన తెలియజేసే స్వేచ్ఛ కూడా లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలనువెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ లో పాల్గొన్న తెరాస ఎం ఎల్ ఏ లు, మంత్రులు, నాయకులు, చలో హైదరాబాద్ కి వెళ్తుండగా అరెస్ట్ లు చేయడం సరికాదని అన్నారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, అక్రమ అరెస్ట్ లను ప్రజాస్వామిక వాదులు, మేధావులు ఖండించాలని పిలుపునిచ్చారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నమీండ్ల శ్రీనివాస్,టీపీసీసీ కార్యదర్శి కొత్తపెల్లి శ్రీనివాస్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంక సంపత్ యాదవ్,డివిజన్ అధ్యక్షులు నల్లా సత్యనారాయణ, కొత్తూరు రాజు తదితరులను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm