హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఉద్యోగులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న జీతాల పెంపు ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏ క్షణమైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉద్యోగుల వేతనాల పెంపుపై ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉద్యోగ సంఘాలు సైతం ఈ అంశంపై నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి. ఒక వేళ ఆలస్యమైనా ఈ నెలాఖరుకు ఖచ్చితంగా సీఎం కేసీఆర్ నుంచి ప్రకటన రావడం ఖాయమని ఆయా సంఘాల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫిట్‌మెంట్ కూడా సంతృప్తికరంగా ఉంటుందని వారు తమను కలిసిన ఉద్యోగులకు చెబుతున్నారు.
ఇప్పటికే పదోన్నతులకు సంబంధించి సర్వీసును కుదిస్తూ సర్కార్ జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రభుత్వ నిర్ణయం ద్వారా మొత్తం 50 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయని ఉద్యోగ సంఘాల నేతలు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన ప్రమోషన్లు నెరవేరుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక మిగిలిన ఫిట్‌మెంట్, పదవీ విరమణ వయస్సు పెంపుపై సైతం త్వరలోనే ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని వారు చెబుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 19 Jan,2021 11:51AM