హైదరాబాద్ : దేశంలో మరోసారి ముడిచమురు ధరలు పెరిగాయి. వరుసగా రెండో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు 25 పైసల చొప్పున పెరిగాయి. వారం రోజుల వ్యవధిలోనే చమురు ధరల్లో రూపాయి పెరుగుదల కనిపించింది.
- ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.85.20 గా ఉంది. డీజిల్ ధర రూ. 75.38.
- కోల్ కత్తాలో పెట్రోల్ ధర రూ. 86.63, డీజిల్ ధర రూ. 78.97.
- చెన్నైలో పెట్రోల్ ధర రూ.87.85, డీజిల్ ధర రూ.80.67.
- ముంబైలో పెట్రోల్ ధర రూ. 91.80, డీజిల్ ధర రూ. 82.13.
- హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.88.63, డీజిల్ ధర రూ. 82.26కి చేరింది. ఈ నేపథ్యంలో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 19 Jan,2021 12:01PM