హైదరాబాద్ : పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భీమడోలు మండలం కురెళ్ళగూడెం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. ఏలూరు వైపు వస్తున్న కారును తాడేపల్లిగూడెం వైపు వెళ్తున్న కారు డివైడర్ పైనుంచి దూకి ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm