హైదరాబాద్ : ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు సాధించిన విజయంపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు. అడిలైడ్ టెస్ట్ తర్వాత మా సామర్థ్యాన్ని అనుమానించిన వాళ్లంతా ఒక్కసారి ఈ విజయాన్ని చూడండి అంటూ విరాట్ ట్వీట్ చేశాడు. ఏం విజయమిది. మా సామర్థ్యాన్ని శంకించిన వాళ్లంతా ఒక్కసారి ఈ విజయాన్ని చూడండి. అత్యద్భుతమైన ప్రదర్శన. ప్లేయర్స్ చూపించిన తెగువ, సంకల్ప బలం నిజంగా అద్భుతం. ఈ చారిత్రక విజయాన్ని ఆస్వాదించండి అంటూ కోహ్లి ప్రశంసలు కురిపించాడు.
Mon Jan 19, 2015 06:51 pm