హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య వాగ్వివాదం జరిగింది. జిల్లాలోని గుడిహత్నూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవం జరిగింది. అయితే కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ప్రధాని మోడీ ఫొటో లేనందుకు బీజేపీ జడ్పీటీసీ సభ్యుడు పతంగే బ్రహ్మనంద్, పీఏసీఎస్ చైర్మన్ ముండే సంజీవ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటంతో ఉన్న ఫ్లెక్సీని చింపేశారు. దీంతో టీఆర్‌ఎస్ ఎంపీపీ రాథోడ్ పుండలిక్, బీజేపీ జడ్పీటీసీ పతంగే బ్రహ్మనంద్‌ల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని సముదాయించారు.
Mon Jan 19, 2015 06:51 pm