హైదరాబాద్ : ఏపీలోని మైలవరం పట్టణంలోని ఆర్.సి రెసిడెన్సీ(లాడ్జి)లో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు లాడ్జికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అక్కడ దొరికిన ఆధారాలతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని విజయవాడ నగరంలోని ఎల్ఐసీ కాలనీకి చెందిన వేగి చంద్రమౌళి(60)గా పోలీసులు గుర్తించారు. చంద్రమౌళి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm