హైదరాబాద్ : హైదరాబాద్ శివారు శంషాబాద్ ఔటర్ రింగు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీని డీసీఎం వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. మృతులు వికారాబాద్ జిల్లా జిల్‌కల్ గ్రామానికి చెందిన చంద్రయ్య, శ్రీనులుగా గుర్తించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు చేరుకున్నారు. డీసీఎం వ్యాన్‌లో ఇరుకున్న మృతదేహాలను బయటకు తీసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm