హైదరాబాద్ : మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా భడ్లి బుద్రుక్ గ్రామంలో ఓ హిజ్రా గ్రామ పంచాయతీ సభ్యులుగా ఎన్నికయ్యారు. అంజలి అనే వ్యక్తి మహారాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన తొలి హిజ్రాగా ఘనత సాధించారు. జనవరి 15న పోలింగ్ జరగ్గా.. సోమవారం ఫలితాలు వెలువడ్డాయి. ఈ సందర్భంగా అంజలి మీడియాతో మాట్లాడుతూ.. గ్రామస్థులు నాపై నమ్మకంతో ఎన్నుకున్నారు. వారికి నేను రుణపడి ఉంటా. ఇప్పుడు నా బాధ్యతలు పెరిగాయి. గ్రామాభివృద్ధికి నా వంతు కృషి చేస్తా. గ్రామస్థులకు కనీస వసతులు అందించడం సహా అంగన్వాడీలు, వైద్య సదుపాయాలను మెరుగు పరచడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తా అని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm