హైదరాబాద్ : భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభించారు. కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ విషయంలో కూడా జాగ్రత్తలు చెబుతూ ఉన్నారు. ఇక కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటే మందుబాబులు కొద్దిరోజులు అల్కాహల్ కు దూరమవ్వాల్సిందే అంటున్నారు నిపుణులు. కోవిడ్ టీకా తీసుకోవాలనుకునే వారు 45 రోజుల పాటు మద్యం తీసుకోకూడదని సూచించారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం పడుతుందని.. దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్ తీసుకోవాలని భావిస్తున్న వారు కొన్ని వారాల పాటు మద్యానికి దూరంగా ఉండాలని సూచిస్తూన్నారు. నేషనల్ కోవిడ్ టాస్క్‌ఫోర్స్ చైర్మన్ సుదర్శన్ మాట్లాడుతూ ముప్పై రోజుల వ్యవధిలో టీకా రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుందని.. సెకండ్ డోస్ తీసుకున్న రెండు వారాల తర్వాతనే యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మద్యం సేవిస్తే అది రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనకు ఆటంకం కలిగిస్తుందని అన్నారు.
అలాగని ఇప్పటి వరకు లభించిన ఆధారాల ప్రకారం వ్యాక్సిన్ పూర్తి ప్రయోజనాలు పొందాలంటే మద్యానికి దూరంగా ఉండాలని తెలిపారు. సెకండ్ డోస్ తీసుకున్న రెండు వారాల తర్వాత యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నాయని ఆధారాలు ఉన్నాయని.. టీకా తీసుకోవాలనుకునే వారు.. ఇప్పటికే తీసుకున్న వారు 45 రోజుల పాటు మద్యానికి దూరంగా ఉండటం మంచిదని చెబుతూ ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 20 Jan,2021 03:24PM