హైదరాబాద్ : తెలంగాణలో ఆడపిల్లల పెండ్లి భారం కావద్దు అనే ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్.. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్ని అమలు చేస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈరోజు మంత్రి.. ధర్మపురి మండలానికి చెందిన లబ్ధిదారులకు 63 మందికి 62,57,308 లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టి పేదలకు అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఆడపిల్లల తల్లికే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇస్తున్నామని తెలిపారు. అలాగే గర్భిణిలకు అంగన్ వాడీల ద్వారా పాలు, గుడ్లు పోషకాహార రూపంలో అందజేస్తున్నామని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేర్లు చెప్పి ఎవరైనా డబ్బులు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm