హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌కు కాబోయే ముఖ్యమంత్రికి కంగ్రాట్స్ అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగ వేదికలపైనే చెబుతున్నారు. వీటిపై కేటీఆర్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. గురువారం సికింద్రాబాద్ రైల్వే ఎంప్లాయిస్ సంఘం కార్యాలయం ప్రారంభోత్సవంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు.. కేటీఆర్ పక్కనే ఉండగా 'కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు' అంటూ చెప్పారు. కానీ మంత్రి కేటీఆర్ ప్రసంగంలో గానీ దీనిపై ఎలాంటి రియాక్షన్ రాలేదు. మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంకొంచెం ముందుకెళ్లి కేటీఆర్‌కు కంగ్రాట్స్ చెబుతూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. కంగ్రాట్స్ కేటీఆర్ అన్న అంటూ ఎమ్మెల్యే పోస్ట్ చేశారు. ఈ పరిణామాలన్ని చూస్తుంటే తెలంగాణలో త్వరలో కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm