హైదరాబాద్ : నల్గొండ జిల్లాలోని అంగడిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సభవించింది తెలిసిందే. గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ఈ ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాలపాలై చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యాధికారులను సీఎం ఆదేశించారు.
ఎదురుగా వస్తున్న బోలెరో వాహనాన్ని తప్పించబోయి ఆటో లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతిచెందారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దేవరకొండ దవాఖానకు తరలించారు. బాధితుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 21 Jan,2021 09:22PM