హైదరాబాద్ : దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ముందుగా కరోనా వారియర్స్ కు వ్యాక్సినేషన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కొంత మంది మాత్రం వ్యాక్సిన్ ను తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. ఇందుకు ఉదాహరణే ఈ సంఘటన. కర్ణాటకలోని తూముకూరు డీఎంఓ, గవర్నమెంట్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కోవాగ్జిన్ తీసుకునేందుకు మీడియా కవరేజీ కోసం నటిస్తూ ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
వివరాల ప్రకారం.. కర్ణాటకలోని తూముకూరు జిల్లా ఆసుపత్రిలో జనవరి 16న వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు. అయితే ఇందులో భాగంగా తూముకూరు డీఎంఓ, గవర్నమెంటు కళాశాల ప్రిన్సిపాల్ రజనీకి వైద్యులు భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ ను అందజేయడానికి ప్రయత్నించారు. అయితే మీడియా కవరేజీ కోసం వ్యాక్సిన్ ను తీసుకున్నట్లు వీరిద్దరు నటించారు. అంతేకాకుండా వ్యాక్సిన్ తాకకుండానే వారు ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీడియా కవరేజీ కోసం వీరు చేసిన ఓవర్ యాక్షన్ చూసిన నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వెంటనే వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యాక్సిన్ పై వీరికే నమ్మకం లేనట్లుంది అని ఓ వ్యక్తి కామెంట్ పెట్టగా.. ఉన్నతాధికారులే ఈ విధంగా నటిస్తే సామాన్యులకు వ్యాక్సిన్ పై నమ్మకం ఎలా ఉంటుదని మరో నెటిజన్ ప్రశ్నించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 22 Jan,2021 07:59AM