హైదరాబాద్ : దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారి మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. తాజగా కర్ణాటకలోని శివమొగ్గ నగరంలో కరోనా టీకా వేయించుకున్న ప్రముఖ ప్రైవేటు వైద్యుడు గుండెపోటుతో మరణించడం కలకలం రేపుతోంది. జేపీ ఆస్పత్రి యజమాని, ఓ మెడికల్ కాలేజీలో ఆర్ధోపెడిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ జయప్రకాశ్ (58) ఈ నెల 17వ తేదీన కోవిషీల్డ్ టీకా వేయించుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఆయన గుండె పోటుతో మృతిచెందారు. ఈ విషయమై జిల్లా వైద్యారోగ్య అధికారులు మాట్లాడుతూ డాక్టర్ జయప్రకాశ్ హృద్రోగంతో బాధపడుతున్నారు, కొన్ని సంవత్సరాల కిందట ఆయనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm