I got my covaxin shot! Thanks to the team @gmcrgggh for the seamless experience. Appeal everyone to do it when your turn comes. Let's end #Covid19 together. #COVIDVaccination @MoHFW_INDIA @drharshvardhan @CMOTamilNadu @RAKRI1 @ETRajan1 @TNDME1 @TNDPHPM pic.twitter.com/i3PZFW4no2
— Dr C Vijayabaskar (@Vijayabaskarofl) January 22, 2021
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈరోజు తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సీ విజయభాస్కర్ కోవాగ్జిన్ టీకా తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. తన ట్విట్టర్‌లో టీకా తీసుకున్న విషయాన్ని చెప్పిన మంత్రి.. ఓ డాక్టర్‌గా.. ఐఎంఏ సభ్యుడి హోదాలో టీకా వేసుకున్నట్లు తెలిపారు. హెల్త్ కేర్ వర్కర్లలో విశ్వాసాన్ని నింపేందుకు కూడా తాను తీకా తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, కోవిడ్19 నుంచి రక్షణ పొందాలని ఆయన తన ట్విట్టర్‌లో తెలిపారు.