హైదరాబాద్ : పెనుబల్లి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన కార్మిక కర్షక రాష్ట్ర జాతరకు కార్మికల నుండి ఘన స్వాగతం లభించింది. మండల కేంద్రంలోని తాపీ హమాలి రిక్షా కార్మిక సంఘం ఆధ్వర్యంలో జాతకు కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్.. మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం.. రైతులు, పేద కార్మిక వర్గాల సమస్యలను పక్కనబెట్టి.. దేశ సంపదను అంబానీ, ఆదానీ, కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక కార్మిక కర్షక చట్టాలను వ్యతిరేకంగా తీసుకొచ్చి హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తోందన్నారు. రైతులు, పేద కార్మికుల సమస్యలపై పోరాడి సాధించుకునందుకే రాష్ట్రవ్యాప్త జాతరకు సిఐటియు పోరాటానికి సిద్ధమైందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వర రావు, అధ్యక్షులు తుమ్మ విష్ణు, శ్రామిక మహిళా జిల్లా నాయకురాలు బి.రమ్య, సిఐటియు రాష్ట్ర నాయకులు చలమల విట్టల్ రావు, నాయకులు కొప్పులగోవిందరావు, మిద్దెస్వామి, అన్నపరెడ్డి లక్ష్మయ్య, దేశినివెంకటేశ్వరరావు, మేకల బాలాజీ, గాయం తిరుపతిరావు, ఖండే సత్యం, తాండ్ర రాజేశ్వరరావు , చీ పి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
Mon Jan 19, 2015 06:51 pm