హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీబీపేట మండల శివారులో రెండు బైకులు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి మెదక్ జిల్లా రాజ్ పల్లి గ్రామానికి చెందిన కమ్మరి మధు (30)గా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm