హైదరాబాద్ : కర్ణాటకలోని శివమొగ్గలో జరిగిన భారీ పేలుడుకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 8మంది కూలీలు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కర్ణాటక ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక సీఎం యడియూరప్ప ప్రకటించారు.
ఈ ప్రమాద ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ట్విట్టర్ వేదికగా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ఘటన విషాదకరమన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 22 Jan,2021 12:07PM