హైదరాబాద్ : దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా యూపీ విద్యాశాఖ మంత్రి గులాబ్ దేవికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఒక ప్రకటన ద్వారా మీడియాకు వెల్లడించారు. గత రెండు రోజులుగా దగ్గు వస్తుండటంతో లక్నోలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నానని, ఆ పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్‌గా తేలిందని గులాబ్ దేవి తెలిపారు. అందువల్ల ఇటీవల తనతో సన్నిహితంగా మెలిగిన అధికారులు, పార్టీ నేతలు, కార్యకర్తలు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, ఎవరికివారు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని ఆమె సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm