హైదరాబాద్: సిద్దిపేట పట్టణంలోని విపంచి కళా నిలయంలో పలువురు కాలకుంట లబ్ధిదారులకు మంత్రి హరీష్‌రావు నివాస స్థలాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఒకప్పుడు కాలకుంట కాలనీ పట్టణానికి దూరంగా ఉండేదన్నారు. కాలకుంటలో నిరుపేదలు నివసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీంతో కాలకుంట కాలనీకి చెందిన 180 మంది లబ్ధిదారులకు నివాస స్థలాలకు పట్టాలు పంపిణీ చేశామని మంత్రి హరీష్‌రావు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm