గువాహటి: లోయలో పడి అసోం రాష్ట్రానికి చెందిన ఆరుగురు వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు. మేఘాలయా రాష్ట్రం ఈస్ట్ జైన్షియా హిల్స్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 150 అడుగుల ఎత్తు నుంచి లోయలోకి పడిపోవడంతో ఆరుగురు వలస కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మేఘాలయాలోని జైన్షియా హిల్స్ జిల్లాలో 2018 డిసెంబర్లో కూడా ఓ అక్రమ బొగ్గు గని కుప్పకూలీ 15 మంది కూలీలు మృతిచెందారు. కాగా, తాజా ప్రమాదం కూడా అక్రమ బొగ్గుగని కారణంగానే జరిగిందని, అక్రమంగా బొగ్గుగని తవ్వేందుకు వచ్చే ఆ ఆరుగురు వలసకూలీలు మృతిచెందారని స్థానికులు చెబుతున్నారు. కానీ, మేఘాలయా ప్రభుత్వ వర్గాలు మాత్రం అక్కడ అక్రమ బొగ్గుగనులు ఏవీ లేవని, అయితే మరేదో అవసరం కోసమో అక్కడ నేలను చదును చేస్తున్నారని తెలిపాయి.
Mon Jan 19, 2015 06:51 pm