చెన్నై: ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీధి మయ్యం చీఫ్ కమల్ హాసన్ కాలుకు సంబంధించిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. చెన్నైలోని శ్రీరామ చంద్ర హాస్పటల్ నుంచి ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు కమల్‌హాసన్. డిశ్చార్జ్ సందర్భంగా ఆస్పత్రి సిబ్బందితో కలిసి ఫొటోలు దిగారు. కమల్‌హాసన్ చాలా హుషారుగా నవ్వుతూ ఆస్పత్రి టీంతో కలిసి దిగిన ఫొటోలను రమేశ్ బాలా ట్వీట్ చేశారు. కమల్‌హాసన్ కాలుకు విజయవంతంగా సర్జరీ పూర్తయింది. ఇవాళ డిశ్చార్జయ్యారు. కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారని ట్వీట్ లో పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదం కారణంగా నా కాలుకు శస్త్రచికిత్స చేయించుకున్నానని కమల్‌హాసన్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm