న్యూఢిల్లీ: గతవారం గురుగ్రామ్ కొవిషీల్డ్ కరోనా టీకా తీసుకున్న మహిళా ఆరోగ్య కార్యకర్త ఈ రోజు ఉదయం మరణించారు. ఆమె మృతికి కారణం తెలియాల్సి ఉంది. ఆమె మృతదేహాన్ని అటాప్సీ కోసం పంపినట్టు వైద్యులు తెలిపారు. బాధితురాలు రేవంతి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాత్రి నిద్రపోయిన ఆమె ఈ ఉదయం లేవకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెంటనే మేదాంత ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రేవంతి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. గత శనివారం ఆమెకు కరోనా టీకా ఇవ్వగా ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత కానీ రేవంతి మృతికి కారణం తెలియదని గురుగ్రామ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వీరేంద్ర యాదవ్ తెలిపారు. కాబట్టి ఆమె మృతి గురించి ఇప్పుడే మాట్లాడడం సరికాదని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm