హైదరాబాద్: ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్, జబర్ధస్త్ షో జడ్జ్ రోజాపై ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇపుడు వివాదాస్పద అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే జబర్దస్త్ వంటి కామెడీ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఐతే.. రాజకీయాల్లో ఉంటూ జబర్దస్త్ షో చేయడంపై కొన్ని విమర్శలు చెలరేగినా.. రోజా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా.. రెండు పడవలపై ప్రయాణం చేస్తూనే ఉంది. తాజాగా రోజా చేస్తోన్న ఈ కామెడీ షోపై కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేసాడు. పవన్ కళ్యాణ్ పై ఎన్నోసార్లు అనుచిత వ్యాఖ్యలు చేసాడు. రీసెంట్‌గా సునీత రెండో పెళ్లిపై కూడా తనదైన శైలిలో విమర్శలు ఎక్కుపెట్టాడు. తాజాగా రోజా జడ్జ్‌గా వ్యవహరిస్తోన్న జబర్ధస్త్ కామెడీ షోపై ఇదే విధమైన కామెంట్స్ చేసాడు. వెకిలి కామెడీ షోకు వేదికైన జబర్ధస్త్ కామెడీ షోను రోజా ఒదిలేస్తేనే ఆమె ఇమేజ్‌కు బాగుంటుందని చెప్పుకొచ్చాడు. తాజాగా రోజా ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమటీ సమావేశంలో తనను కూరలో కరివేపాకులో తీసి పారేసారని వాపోయింది. జబర్ధస్త్ కామెడీ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తోన్న మీకు అధికారులు ఇంతకన్న ఎవరు పెద్దగా గౌరవం ఉండదన్నారు. జబర్ధస్త్ షోలో హైపర్ ఆది అనాథలపై వేసిన వెకిలీ కామెడీకి రోజా పగలపడి నవ్వింది. ఓ బాధ్యతగల ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఆమె ఇలాంటి స్కిట్స్‌కు నవ్వడంతోనే ఆమె స్థాయి దిగజారి పోయేలా ప్రవర్తించారన్నారు. రోజా ఓ ఎమ్మెల్యేగా అభిమానులకు, ప్రజలకు ఎంత చేసినా.. జబర్థస్త్ వంటి ప్రోగ్రామ్స్‌కు జడ్జ్‌గా వ్యవహరించడం మానకపోతే మీకు దక్కాల్సిన గౌరవం దక్కదన్నారు. అధికారులు కూడా రోజాను ఓ కామెడీ యాక్టర్‌గా లైట్‌గా తీసుకుంటున్నారంటూ చెప్పుకొచ్చాడు. గౌరవం అనేది ఒకరు ఇస్తే.. ఇచ్చేది కాదంటూ ఒకింత ఘాటు వ్యాఖ్యలనే చేసారు కత్తి మహేష్. ఐతే... రోజాతో పాటు ఆమె అభిమానులు మాత్రం ఆమెకు ఇంతక క్రేజ్ రావడానికి కారణం హీరోయిన్‌గానే కాకుండా.. జబర్ధస్త్ కామెడీ షోకు జడ్జ్‌గా వ్యవహరించడం కూడా ఓ రీజనని చెబుతూ ఉంటారు.
Mon Jan 19, 2015 06:51 pm