న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో నిరసన చేస్తున్న రైతుల్లో ఇప్పటి వరకు 76 మంది రైతులు ప్రాణాలు వదిలినట్లు తనకు రిపోర్టు వచ్చిందని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు. అయితే నిరసనలో చనిపోయిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. చనిపోయిన పంజాబ్ రైతుల ఒక్కో కుటుంబానికి ఒక్కో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులతో పాటు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ గొంతు కలిపారు. ఇప్పటికే ఈ విషయమై కేంద్రానికి పలుమార్లు విజ్ణప్తులు చేశారు. ఇక రైతులు ప్రభుత్వం మధ్య నేటితో కలిపి 11 సార్లు చర్చలు జరిగాయి. అయినప్పటికీ ఇరు వర్గాల మధ్య ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. చట్టాల్లో సవరణలు సూచించడం మినహా రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్రం చెబుతుండగా, చట్టాల రద్దు మినహా తమకు ఏ ప్రతిపాదనా అవసరం లేదని రైతులు చెబుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm