హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ఈ ఏడాది కూడా పది పరీక్షలు ఉంటాయా? ఉండవా? అన్న సందేహం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ పరీక్షలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది తప్పనిసరిగా టెన్త్ పరీక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. పరీక్షల షెడ్యూల్ ను మరో వారం రోజుల్లో విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు. పరీక్ష 11 పేపర్లతో ఉంటుందా? లేదా 6 పేపర్లా? అనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. అయితే.. మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు ఉంటాయని తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm