నవతెలంగాణ-మెండోరా
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని పోచంపాడ్ గ్రామం గోదావరి నదిపై గల విఐపి పుష్కరఘాట్ వద్ద యువకుడు గల్లంతైనట్లు మండల ఎస్ఐ పి.సురేష్ తెలిపారు. ఎస్ఐ సురేష్ వివరిస్తూ పెర్కిట్ గ్రామానికి చెందిన దాసరి రాజ(16) పదవ తరగతి చదువుతు ఆర్మూర్ లో నివాసం ఉంటున్నారు. దాసరి రాజు సమీప బంధువులతో కలిసి మొత్తం గోదావరి నదిలో స్నానానికి వచ్చారు. సమీప బంధువులు అయిన జగన్నాథ్, సుభాష్, శ్రీనివాస్ లతో కలిసి గోదావరి నదివద్ద ఉన్న విఐపి పుష్కరఘాట్ వద్ద స్నానానికి దిగారు.
ఈత రాక ముగ్గురు నదిలో కొట్టుకు పోతుండగా అక్కడే ఉన్న వ్యక్తి లచ్చన్న అనే వ్యక్తి ఇద్దర్ని కాపాడారు. దాసరి రాజు నదిలో గల్లంతు అయ్యాడు. సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందించగా పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఎస్సై పి.సురేష్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 22 Jan,2021 09:53PM