హైదరాబాద్: కుక్కలను తప్పించబోయి ఓ డాక్టర్‌కు చెందిన కారు రోడ్డు పక్కన ఉన్న చెట్లలోకి దూసుకెళ్లింది. దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదు. నిమ్స్‌లో డాక్టర్‌గా పనిచేసే సైదాబాద్ ప్రాంతానికి చెందిన డాక్టర్ అనుకుల దివ్యారెడ్డి శుక్రవారం తన కారులో హిమాయత్‌సాగర్ ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి రాజేంద్రనగర్ వైపు వస్తుంది. ఆమె నడుపుతున్న కారు వాలంతరీ వద్దకు రాగానే రోడ్డుపై కుక్కలు అడ్డుగా వచ్చాయి. వాటిని తప్పించబోయిన ఆమె కారును రోడ్డు పక్కనున్న చెట్లలోకి తీసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన దివ్యారెడ్డిని రాజేంద్రనగర్ పోలీసులు 108లో ఆసుపత్రికి తరలించారు. ఎవరూ ఫిర్యాదు చేయలేదని రాజేంద్రనగర్ అడ్మిన్ ఎస్ఐ దామోదర్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm