హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలోని బోధన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బోధన్‌లోని పెద్దహనుమాన్ మందిర్ వద్ద ఉన్న టైర్ల దుకాణంలో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ఫర్నిచర్ దుకాణానికి వ్యాపించాయి. దీంతో రెండు షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. శుక్రవారం అర్థరాత్రి దాటినతర్వాత జరిగిన ఈ అగ్నిప్రమాదంలో టైర్ల దుకాణం యజమాని ఇంటి పత్రాలు, రూ.10 లక్షలు విలువచేసే సామాగ్రి దగ్ధమయ్యాయి. టైర్ల షాప్ పక్కనే ఉన్న బాసిద్ హుస్సేన్ ఫర్నిచర్ షాపులో రూ.4 లక్షల విలువచేసే కర్రలు మంటల్లో కాలిపోయాయి. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm